హడలెత్తిస్తున్న గ్రామసింహాలు

10 Mar, 2019 11:11 IST|Sakshi
చిలమానుచేనులో సంచరిస్తున్న గ్రామసింహాలు

సాక్షి, ఓజిలి(సుళ్లూరు పేట):  మండలంలో గ్రామసింహాల బెడద ఎక్కువుగా ఉంది. వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ పాదచారులతో పాటు ద్విచక్రవాహనదారులపై దాడులు చేస్తున్నాయి. మండలంలో 3500కుపైగా వీధి కుక్కలు ఉన్నట్లు అధికారుల అంచనా. గత ఐదేళ్లుగా పంచాయతీ అధికారులు వీధి కుక్కలను నిర్మూలించే కార్యక్రమానికి మంగళంపాడడంతో వీటి సంఖ్య గణణీయంగా పెరిగిపోయింది. వీధికుక్కల బెడదతో ఒంటరిగా పిల్లలను బయట పంపాలంటే భయమేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా కుక్కలు ద్విచక్రవాహన చోదకులను వెంబడిస్తుండడంతో అదుపుతప్పి పడిపోయి గాయాలపాలవుతున్నారు.  


 

మరిన్ని వార్తలు