ఒక్కో మండలానికి రూ.60 లక్షలు | Sakshi
Sakshi News home page

ఒక్కో మండలానికి రూ.60 లక్షలు

Published Wed, Dec 6 2023 12:50 AM

- - Sakshi

నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు మండలానికి రూ.60 లక్షలు మంజూరు చేసింది. రూ.22.20 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంప్యాక్ట్‌ రోడ్లకు రూ.23.63 కేటాయించారు. వీటికి టెండర్లు ఆహ్వానించి పనులు ప్రారంభించేలా పంచాయతీరాజ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రూ.21.77 కోట్లతో మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. రూ 56.58 కోట్లతో 8 ప్రాంతాల్లో నూతన రోడ్లను నిర్మించనున్నారు. జిల్లాలోని 37 మండలాల్లో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా నియోజకవర్గాల శాసనసభ్యుల సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై ప్రవహించకుండా, వర్షాలు పడినా ప్రజలు ఇబ్బందులు పడకుండా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. నిధులు అందుబాటులో ఉండడంతో పనులు ప్రారంభించేలా పంచాయతీరాజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. దగదర్తి, పొదలకూరు, రాపూరు మండలాల్లో రూ.21.77 కోట్లతో మూడు బ్రిడ్జిలు నిర్మించనున్నారు. ఆత్మకూరు, పొదలకూరు, రాపూరు, వెంకటాచలం, ఉదయగిరి తదితర మండలాల్లో రూ.56.58 కోట్లతో నూతన రోడ్లను నిర్మించనున్నారు. రోడ్ల నిర్మాణాలను త్వరగా చేపట్టి పూర్తి చేసేలా పంచాయతీరాజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ద్వారా 2020–21లో రూ.67 కోట్లతో 13 రోడ్లు, రూ.7.89 కోట్లతో 12 రోడ్లకు నిధులు మంజూరు చేశారు. 13 రోడ్లు పూర్తయ్యాయి. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన ద్వారా 2023–24లో 8 రోడ్లు మంజూరు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రూరల్‌ రోడ్డు ప్రాజెక్టు ద్వారా రూ.316 కోట్లతో 196 పనులు చేపట్టారు. 157 పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్‌, రైతు భరోసా కేంద్రాలు తదితర భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్త రోడ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టి త్వరగా పూర్తి చేసేలా పంచాయతీరాజ్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలకు నిధులు

రూ.23.63 కోట్లతో ఇంప్యాక్ట్‌ రోడ్లు

రూ.56.58 కోట్లతో

గ్రామీణ రహదారులు

మూడు బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు

టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తాం

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలో ప్రతి మండలంలో రూ.60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిణాలు చేపట్టేలా చర్యలు తీసుకున్నాం. 13 రోడ్లు, 3 బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.

– శివారెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement