వరుసకు అక్కాచెల్లెళ్లు.. కానీ పెళ్లి చేసుకుని...

4 Jul, 2019 15:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వారణాసి: స్త్రీ, పురుషులు వివాహం చేసుకుంటారనేది.. సాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చాలా మంది తమ బంధం గురించి బాహాటంగానే ప్రకటిస్తున్నారు. మరికొంతమంది ఓ అడుగు ముందుకేసి వివాహం చేసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. వరుసకు అక్కా చెల్లెలు అయిన ఇద్దరు యువతులు బుధవారం పెళ్లి చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయలకు పుట్టినిల్లుగా పేరొందిన వారణాసి వంటి ఆధ్యాత్మిక నగరంలో ఈ ఘటన కలకలం రేపుతోంది. ఇటువంటి వివాహం జరగటం వారణాసి చరిత్రలో మొదటిదని పలువులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు.. కాన్పూర్‌కు చెందిన ఓ యువతి తనకు చెళ్లి వరుస అయ్యే మరో యువతిని.. స్థానిక శివాలయానికి తీసుకవెళ్లారు. ఎవరికీ అనుమానం రాకూడదనే ఉద్దేశంతో.. ఎరుపు రంగు చున్నీని ముఖానికి ధరించి వెళ్లారు. తమకు పెళ్లి జరిపించాలని పూజారిని కోరారు. అయితే ఆయన మాత్రం ఇందుకు నిరాకరించారు. అయినప్పటికీ అక్కడే భీష్మించుకుని కూర్చున్న సదరు యువతులు తమకు తాముగా వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ఘటపై వారణాసిలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

మరిన్ని వార్తలు