అంకెల్లో 2015 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

13 Feb, 2015 14:11 IST|Sakshi
అంకెల్లో 2015 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

హైదరాబాద్: క్రికెట్ సమరం, సంబరం మొదలవుతున్నాయి... శనివారం నుంచి మొదలుకానున్న వన్డే క్రికెట్ ప్రపంచకప్లో ఎప్పుడెప్పుడు, ఏవేంటి, ఎంతెంత అనే వివరాలన్నింటినీ సమగ్రంగా మీ కోసం అందిస్తోంది 'సాక్షి' వెబ్సైట్.. ఆ వివరాలేంటో చూద్దామా..

* మొత్తం మ్యాచ్లు - 49 (ఆస్ట్రేలియాలో 26, న్యూజిలాండ్లె 23 మ్యాచ్లు)
* ఎన్ని రోజులు - 44
* ఎన్ని జట్లు - 14
* ఎన్ని మైదానాలు - 14 (ఆస్ట్రేలియాలో 7, న్యూజిలాండ్లో 7 మైదానాలు)
* మొత్తం ప్రైజ్ మనీ - రూ.69 కోట్లు

నగదు బహుమతులు ఇలా..
* గెలిచిన జట్టుకు - రూ.25.8 కోట్లు
* ఒక్క మ్యాచ్ కూడా ఓడని జట్టుకు - రూ.27.6 కోట్లు
* రన్నరప్ జట్టుకు - రూ.12 కోట్లు
* సెమీఫైనల్స్లో ఓడిన జట్టుకు - రూ.4.15 కోట్లు
* క్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్టుకు - రూ.2.07 కోట్లు
* గ్రూప్ మ్యాచ్లో గెలిచిన జట్టుకు - రూ.31.20 లక్షలు
* గ్రూప్ దశలో వెనుదిరిగిన జట్టుకు - రూ.24 లక్షలు

మ్యాచ్ వేదికలు..
* ఆస్ట్రేలియా: అడిలైడ్, బ్రిస్బేన్, కాన్బెర్రా, హోబర్ట్, మెల్బోర్న్, సిడ్నీ, పెర్త్
* న్యూజిలాండ్: ఆక్లాండ్, క్రైస్ట్ చర్చ్, డ్యూన్డిన్, హామిల్టన్, నేపియర్, నెల్సన్, వెల్లింగ్టన్
* ఫైనల్ - మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ - మార్చి 29
* అత్యధిక పరుగులు - 2278, సచిన్ టెండూల్కర్, 45 మ్యాచ్లు
* ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు - 188, గ్యారీ కిర్స్టన్, దక్షిణాఫ్రికా
* అత్యధిక వికెట్లు - 71, గ్లెన్ మెక్గ్రాత్, 39 మ్యాచ్లు.

>
మరిన్ని వార్తలు