ఒకే ఈవెంట్‌లో 3 ప్రపంచ రికార్డులు

6 Aug, 2015 01:43 IST|Sakshi

కజాన్ (రష్యా) : ప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ రికార్డుల జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన మిక్స్‌డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలేలో మూడు కొత్త ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఉదయం జరిగిన రెండో హీట్‌లో రష్యా బృందం 3ని:45.87 సెకన్లతో రేసును ముగించి... 2014 జనవరిలో 3ని:46.52 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును తిరగరాసింది. ఆ వెంటనే మూడో హీట్‌లో రియాన్ మర్ఫీ, కెవిన్ కార్డెస్, కెండిల్ స్టీవార్ట్, లియా నీల్‌లతో కూడిన అమెరికా బృందం 3ని:42.33 సెకన్లలో గమ్యానికి చేరుకొని కొన్ని నిమిషాలముందు రష్యా సాధించిన ప్రపంచ రికార్డును సవరించింది.

సాయంత్రం జరిగిన మిక్స్‌డ్ 4ఁ100 మీటర్ల మెడ్లే రిలే ఫైనల్లో క్రిస్ వాకర్, ఆడమ్ పీటీ, మేరీ ఒకానర్, ఫ్రాన్ హల్‌సల్‌లతో కూడిన బ్రిటన్ జట్టు 3ని:41.71 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని కొత్త ప్రపంచ రికార్డు లిఖిండంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.

>
మరిన్ని వార్తలు