గిల్‌క్రిస్ట్‌తో కోహ్లి ముచ్చట్లు

20 Nov, 2018 11:10 IST|Sakshi

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో టీమిండియా బుధ‌వారం జ‌రిగే మొద‌టి టీ20లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు సోమవారం  నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. ఆదివార‌మే గ‌బ్బా స్టేడియం వేదికగా తొలి రోజు ట్రైనింగ్ సెష‌న్‌లో పాల్గొన్న టీమిండియా.. రెండో రోజు కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది.  దీనిలో భాగంగా మాజీ ఆసీస్ వికెట్ కీప‌ర్ గిల్‌క్రిస్ట్‌తో విరాట్‌ కోహ్లి కాసేపు సరదాగా ముచ‍్చటించాడు. ఆ ఫోటోల‌ను బీసీసీఐ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది.

కోహ్లితో పాటు ధావ‌న్‌, రాహుల్‌లు కూడా కొంత సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌల‌ర్ బుమ్రా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయ‌డం విశేషం. బుధవారం ఆరంభమయ్యే టీ20 సిరీస్‌లో తాము కేవలం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మీద దృష్టిపెడితే సరిపోదని ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌నైల్‌ అన్నాడు. భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సైతం ప్రమాదకర ఆటగాడే అని చెప్పాడు.

మరిన్ని వార్తలు