నజీర్‌‌కు సెహ్వాగ్‌ లాంటి బుర్ర లేదు : అక్తర్‌

29 Apr, 2020 13:11 IST|Sakshi

కరాచి : పాకిస్థాన్ మాజీ పేసర్‌ షోయ‌బ్ అక్త‌ర్ ఎప్పుడో ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా పాక్‌ యువ ఆటగాడు ఇమ్రాన్‌ నజీర్‌ను టీమిండియా మాజీ విధ్వంసక ఆటగాడు వీరేంద్ర సెహ్వగ్‌తో పోల్చి నవ్వుల పాలయ్యాడు. ఇమ్రాన్‌ నజీర్‌కు సెహ్వగ్‌ కంటే ఎక్కువ టాలెంట్‌ ఉందని.. కానీ వీరు లాంటి బుర్ర మాత్రం లేదని  అత‌డికి లేద‌ని అక్తర్‌ పేర్కొన్నాడు. ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అక్తర్‌ మాట్లాడుతూ.. ' సెహ్వాగ్ లాంటి బుర్ర ఇమ్రాన్ న‌జీర్‌కు ఉంద‌ని నేను అనుకోవ‌డం లేదు. అలాగే న‌జీర్‌లో ఉన్న నైపుణ్యం సెహ్వాగ్‌లో లేదు. ఇమ్రాన్‌ నజీర్‌ మంచి నైపుణ్యం కలిగిన ఆటగాడు.. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నజీర్‌ చేసిన వీరోచిత సెంచరీ అది నిరూపించింది. మంచి భవిష్యత్తు ఉన్న నజీర్‌ను ఆడిస్తే మంచి క్రికెటర్‌ అయ్యేవాడు. ఇదే విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డుకు తెలిపినా నా మాట పట్టించుకోలేదు. ఇది నిజంగా మాకు దురదృష్టమే.. ఎందుకంటే నజీర్‌ లాంటి నైపుణ్యం ఉన్న ఆటగాడిని వదులుకోవాల్సి వచ్చంది. అన్ని షాట్లను కచ్చితంగా ఆడగల నజీర్‌లో మంచి ఫీల్డర్‌ కూడా ఉన్నాడు. కానీ అతని సేవలు పాక్‌ జట్టు అంతగా వినియోగించుకోవడం లేదంటూ'  చెప్పుకొచ్చాడు. ('మాకు కోహ్లి అంకుల్‌ సెల్ఫీ కావాలి')

అయితే షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యలపై సెహ్వాగ్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఆటలో ఓనమాలు దిద్దుకుంటున్న నజీర్‌ను సెహ్వాగ్‌తో పోల్చడమేంటని విమర్శిస్తున్నారు. పాక్‌ తరపున ఇమ్రాన్‌ నజీర్‌ 8 టెస్టుల్లో 427, 79 వన్డేల్లో 1895, 25 టీ20ల్లో 500 పరుగులు చేశాడు. మరోవైపు భారత విధ్వంసక ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 140 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 టీ20ల్లో 394 పరుగులు సాధించాడు.
('మెక్‌గ్రాత్‌ గుర్తుంచుకో.. నేనింకా క్రీజులోనే ఉన్నా')

>
మరిన్ని వార్తలు