భారత్ పరాజయం

28 Nov, 2015 00:31 IST|Sakshi
భారత్ పరాజయం

రాయ్‌పూర్: హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత జట్టుకు తొలి మ్యాచ్‌లోనే పరాజయం ఎదురైంది. పూల్ ‘బి’లో భాగంగా అర్జెంటీనాతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. అర్జెంటీనా తరఫున గొంజాలో పిలాట్ (3వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... జోకిన్ మెనిని (24వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న అర్జెంటీనా ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత్ ఆటతీరులో సమన్వయలేమి స్పష్టంగా కనిపించింది. అర్జెంటీనా ఏకంగా తొమ్మిది పెనాల్టీ కార్నర్‌లు సంపాదించి వాటిలో మూడింటిని గోల్స్‌గా మలచగా... భారత్‌కు లభించిన ఏకైక పెనాల్టీ కార్నర్ వృథా అయింది.  శనివారం జరిగే మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది.
 

మరిన్ని వార్తలు