బోపన్న జోడీ ఓటమితో మొదలు 

15 Nov, 2023 03:19 IST|Sakshi

టురిన్‌ (ఇటలీ): పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌ను రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) జోడీccతో ప్రారంభించింది. రాజీవ్‌ రామ్‌ (అమెరికా)–జో సాలిస్‌బరీ (బ్రిటన్‌) జోడీతో జరిగిన రెడ్‌ గ్రూప్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం 3–6, 4–6తో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి తమ సvస్‌ను రెండుసార్లు కోల్పోయింది. 

మరిన్ని వార్తలు