ఆసీస్, కివీస్ ఫైనల్ చేరాయిలా..

28 Mar, 2015 14:11 IST|Sakshi
ఆసీస్, కివీస్ ఫైనల్ చేరాయిలా..

మెల్బోర్న్: వన్డే ప్రపంచ కప్ టైటిల్ రేసులో ఆతిథ్య జట్లే మిగిలాయి. ఆదివారం జరిగే గ్రాండ్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసీస్ ఐదోసారి ప్రపంచ కప్ సాధించాలని ఆరాటపడుతుండగా, కివీస్ తొలిసారి ప్రపంచ చాంపియన్ కావాలని ఉవ్విళ్లూరుతోంది. విజేత ఎవరన్నది ఆదివారం సాయంత్రం తేలనుంది.

లీగ్ దశలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు రెండూ గ్రూపు-ఎలో ఆడాయి. కివీస్ ఆరు లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గి గ్రూపు టాపర్గా నిలిచింది. ఆసీస్ నాలుగు లీగ్ మ్యాచ్ల్లో గెలుపొందింది.  కివీస్ చేతిలో ఆసీస్ ఓడగా, బంగ్లాదేశ్తో మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రపంచ కప్లో ఈ రెండు జట్ల ప్రస్థానం ఎలా సాగిందంటే..

న్యూజిలాండ్

లీగ్ దశ

శ్రీలంకపై 98 పరుగులతో ఘన విజయం
స్కాట్లాండ్పై 3 వికెట్లతో గెలుపు
ఇంగ్లండ్పై 8 వికెట్లతో భారీ విజయం
ఆస్ట్రేలియాపై 1 వికెట్ తేడాతో గెలుపు
అప్ఘానిస్థాన్పై 6 వికెట్లతో విజయం
బంగ్లాదేశ్పై 3 వికెట్లతో గెలుపు

క్వార్టర్ ఫైనల్

వెస్టిండీస్పై 143 పరుగులతో ఘనవిజయం

సెమీ ఫైనల్

దక్షిణాఫ్రికాపై 4 వికెట్లతో ఉత్కంఠ విజయం

ఆస్ట్రేలియా

లీగ్ దశ

ఇంగ్లండ్పై 111 పరుగులతో ఘన విజయం
వర్షం కారణంగా బంగ్లాదేశ్తో మ్యాచ్ రద్దు
న్యూజిలాండ్ చేతిలో వికెట్ తేడాతో ఓటమి
అప్ఘానిస్థాన్పై 275 పరుగులతో భారీ విజయం
శ్రీలంకపై 64 పరుగులతో గెలుపు
స్కాట్లాండ్పై 7 వికెట్లతో విజయం

క్వార్టర్ ఫైనల్

పాకిస్థాన్పై 6 వికెట్లతో విజయం

సెమీ ఫైనల్

భారత్పై 95 పరుగులతో భారీ గెలుపు

మరిన్ని వార్తలు