పాట్ కమిన్స్..ఓ చెత్త బంతి!

29 Aug, 2017 12:03 IST|Sakshi
పాట్ కమిన్స్..ఓ చెత్త బంతి!

ఢాకా: అంతర్జాతీయ క్రికెట్ లో రికార్డులనేవి సాధారణం. అందులో అరుదైన ఘనతలతో పాటు చెత్త రికార్డులను కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే క్రికెట్ ఫీల్డ్ లో బౌలర్లు నిర్లక్ష్యంగా బౌలింగ్ చేయడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఈ తరహా ఓ చెత్త బంతిని ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ తాజాగా సంధించి వార్తల్లో నిలిచాడు.

బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్ 67 ఓవర్ లో కమిన్స్ వేగంగా వేసిన బంతి అతని చేతి నుంచి జారిపోయి ఆఫ్ సైడ్ వైపు సుదూరంగా దూసుకుపోయింది. తొలుత అసలు బంతి ఎక్కడ పడుతుందో అని అటు క్రీజ్ లో ఉన్న బ్యాట్స్మన్ తో పాటు వికెట్ల వెనుక ఉన్న ఫీల్డర్లు చూస్తూ ఉండిపోగా, దాన్ని చూసి బౌలర్ కమిన్స్ కూడా నవ్వకుండా ఉండలేకపోయాడు.. దీన్ని ఫీల్డ్ అంపైర్ నిజేల్ నో బాల్ గా ప్రకటించాడు.