బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా

5 Jun, 2015 18:26 IST|Sakshi
బీసీసీఐ అవినీతి నిరోధక చీఫ్ రాజీనామా

న్యూఢిల్లీ:  గత మూడు సంవత్సరాల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అవినీతి నిరోధక విభాగానికి చీఫ్ గా పనిచేస్తున్న రవి సవానీ తాజాగా అతని పదవికి రాజీనామా చేశారు.  వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు సవానీ బీసీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2012వ సంవత్సరంలో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగంలో  చీఫ్ గా నియమితులైన రవి సవానీ.. గత ఏప్రిల్ నెలలోనే తన పదవికి రాజీనామా చేయాలని భావించారు.. అయితే ఐపీఎల్ ఉన్న దృష్ట్యా అతని రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. 

 

రవి సవానీ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. కాగా, రవి సవానీ నోటీస్ ముగింపు కాలం మరో నెల వరకూ ఉండటంతో అప్పటి వరకూ అతను పదవిలో కొనసాగుతారని బీసీసీఐ బోర్డు సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. బీసీసీఐ అవినీతి నిరోధక శాఖ సలహాదారుగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన నీరజ్ కుమార్.. సవానీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు