ఆసీస్ ఆధిపత్యానికి బీజం

2 Feb, 2015 10:15 IST|Sakshi
ఆసీస్ ఆధిపత్యానికి బీజం

ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి బీజం వేసిన టోర్నమెంట్ 1999 టోర్నీ. ఐర్లాండ్, స్కాట్లాండ్, వేల్స్‌లతో కలిసి ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన ఈ వరల్డ్‌కప్‌లో కొత్తగా ‘సూపర్ సిక్స్’ దశను తీసుకొచ్చారు. ఇందులో అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సెమీస్ బెర్తు దక్కించుకునే స్థితిలో ఆసీస్‌ను కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా గట్టెక్కించిన ఘనత కెప్టెన్ స్టీవ్ వాకే దక్కుతుంది.

మరోవైపు లాన్స్ క్లూసెనర్ అద్బుత ఆల్‌రౌండ్ ప్రతిభతో దక్షిణాఫ్రికా దూసుకెళ్లింది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్‌ను తలపించే సెమీఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. టై అయిన ఈ మ్యాచ్‌లో స్టీవ్ వా నాయకత్వశైలికి కితాబివ్వాల్సిందే. సూపర్ సిక్స్ దశలో గ్రూప్ టాపర్‌గా నిలవడంతో ఆసీస్ ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో పాక్‌పై గెలిచి రెండోసారి ప్రపంచకప్‌ను గెలుచుకుంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ సూపర్‌సిక్స్‌తోనే ఇంటిదారిపట్టింది.
 
ఆతిథ్యం: ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్
వేదికలు: 21; పాల్గొన్న జట్లు (12): భారత్, పాకిస్థాన్, శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా, స్కాట్లాండ్, బంగ్లాదేశ్.

మరిన్ని వార్తలు