మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్‌ హాకీ

28 Nov, 2019 05:50 IST|Sakshi

భువనేశ్వర్‌: ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్‌ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్‌కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వరుసగా రెండోసారి కూడా భారత్‌కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్‌ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్‌ఐహెచ్, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా, హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు మహ్మద్‌ ముస్తాక్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు