విజృంభించిన తిలక్, రోహన్

10 Sep, 2016 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో ఠాకూర్ తిలక్ వర్మ (107 బంతుల్లో 136నాటౌట్; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), బౌలింగ్‌లో రోహన్ (7/1) విజృంభించడంతో క్రెసెంట్ స్కూల్ భారీ విజయాన్ని సాధించింది. ఎ- డివిజన్ వన్డేలీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 318 పరుగుల తేడాతో న్యూచైతన్య జూనియర్ కాలేజ్‌పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్రీసెంట్ స్కూల్ 40 ఓవర్లలో 2 వికెట్లకు 327 పరుగులు చేసింది. తిలక్‌తో పాటు అనిరుధ్ (58), వివేక్ (53 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు.

అనంతరం 328 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూ చైతన్య కాలేజ్ బ్యాట్స్‌మెన్‌ను క్రెసెంట్ జట్టు బౌలర్లు హడలెత్తించారు. వీరి ధాటికి చైతన్య కాలేజ్ జట్టు కేవలం 6.5 ఓవర్లలో 19 పరుగులకే ఆలౌటైంది. రోహన్‌తో పాటు త్యాగి (3/12) రాణించాడు.

 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు

లయోలా అకాడమీ: 134 (ధీరజ్ విష్ణు 6/23); కిట్స్ జూనియర్ కాలేజ్: 137/4 (ప్రఫుల్ కుమార్ 51, మనూస్ 58 నాటౌట్). యువ ఎడ్యుకేషనల్ అకాడమీ: 60 (యశ్వంత్ 5/32, కుషాల్ 5/8); డీఏవీ పబ్లిక్ స్కూల్:61/1.  సుల్తాన్ ఉలూమ్ జూనియర్ కాలేజ్: 143 (రెహమాన్ షకూర్ 5/18); మర్యాస్ సెంటినరీ జూనియర్ కాలేజ్:78 (సోఫియాన్ 5/13). నియో క్వాంటమ్ జూనియర్ కాలేజ్:100 ( కశ్యప్ 6/44); ఫస్ట్ క్లాస్ జూనియర్ కాలేజ్: 101/4 ( రోహిత్ 36). భారతీయ విద్యా భవన్‌‌స: 124 (సాయి వర్ధన్ 3/32); అర్బన్ జూనియర్ కాలేజ్:125/6 (సాయికేత్ సాహా 4/17).  విజినరీ జూనియర్ కాలేజ్ : 273/9 (అభినవ్ 46, అబ్ధుల్ ఖలీద్ ఖురేషి 62, మీర్ హుస్సాం 39, అజ్మత్ 59; ఆయూబ్ 5/26); మర్యాస్ కాలేజ్ (యూసుఫ్‌గూడ): 193 (సూరజ్ సక్సేనీ 60, రాహుల్ రావు 46; మొహమ్మద్ నమన్ అఫ్సర్ 5/30).  సెయింట్ ట్ మర్యాస్ జూనియర్ కాలేజ్ (బషీర్‌బాగ్):216 (సాయి కృష్ణ భార్గవ 30, భరత్ 34; పఠాన్ 3/35, అబ్ధుల్ ఖదీర్ 3/37); గెలాక్సీ జూనియర్ కాలేజ్: 215 (లియాఖత్ హుస్సేన్ 65, పఠాన్ 36 నాటౌట్; కృష్ణ భార్గవ 5/43).  హెచ్‌పీఎస్ : 255 (హరీశ్ సింగ్ 95, రాహుల్ నాయక్ 63; గుణ సత్యార్థ్ 4/46); గీతాంజలి సీనియర్ స్కూల్:142 (యశ్ బన్సల్ 84, సాయి పూర్ణానంద్ 31; రిషిక్ రెడ్డి 4/12). గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్: 152 /8 (జి. ప్రకాశ్ 46; సారుు అభినవ్ 3/20); షేర్‌వుడ్ పబ్లిక్ స్కూల్: 78 ( రిచా కీర్తన్ 4/17).

మరిన్ని వార్తలు