ఫ్రాన్స్‌ను నిలువరించి నాకౌట్‌కు డెన్మార్క్‌ 

27 Jun, 2018 01:33 IST|Sakshi

మాస్కో: ప్రపంచకప్‌ గ్రూప్‌ ‘సి’ నుంచి డెన్మార్క్‌ నాకౌట్‌ చేరింది. ఫ్రాన్స్‌తో మంగళవారం జరిగిన పోరును ఆ జట్టు 0–0తో డ్రా చేసుకుంది. మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. 62 శాతం బంతి దాని ఆధీనంలోనే ఉంది. అయినా అడపాదడపా మినహా ఆ జట్టు దాడులకు దిగలేదు. ‘డ్రా’ చేసుకున్నా ముందంజ వేసే అవకాశం ఉండటంతో డెన్మార్క్‌ కూడా పెద్దగా ప్రయోగాలకు పోలేదు. దీంతో ఈ కప్‌లో తొలిసారిగా గోల్సేమీ నమోదు కాకుండానే మ్యాచ్‌ ముగిసింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, రెండు డ్రాలతో 5 పాయింట్లు సాధించిన డెన్మార్క్‌ గ్రూప్‌లో ఫ్రాన్స్‌ (7 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో నిలిచింది. 

పెరూకు ఊరట: ఇదే గ్రూప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పెరూ 2–0తో నెగ్గింది. పెరూ తరఫున కారిల్లో (18వ నిమిషం), గ్యురెరో (50వ నిమిషం) గోల్స్‌ చేశారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక్క విజ యమూ లేకుండానే నిష్క్రమించింది. ఫ్రాన్స్‌ చేతిలో డెన్మార్క్‌ భారీ తేడాతో ఓడి...పెరూపై నెగ్గితే ఆసీస్‌కు కొంత అవకాశాలు ఉండేవి. కానీ అవేవీ జరగలేదు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు