ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌

29 Jul, 2017 00:22 IST|Sakshi
ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్‌

న్యూఢిల్లీ: అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింట్‌ అథ్లెట్‌ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది.

దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ద్యుతీచంద్‌ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణాకు చెందిన నాగపురి రమేశ్‌ వ్యవహరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు