ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత

18 Feb, 2017 19:31 IST|Sakshi
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కన్నుమూత

ఇంగ్లండ్‌ వెటరన్ ఆటగాడు, మాజీ క్రికెటర్‌ పీటర్‌ రిచర్డ్‌సన్‌(86) కన్నుమూశారు. కెంట్, వార్సెస్టర్ షైర్, ఇంగ్లండ్ జట్ల తరఫున ఓపెనర్ గా ఆటను ఆస్వాదించారు రిచర్డ్. 1950, 60 దశకాలలో మేటి ఆటగాళ్లలో రిచర్డ్ సన్ ఒకరు. ఇంగ్లండ్ తరఫున 1956-1963 మధ్య కాలంలో 34 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్ సన్ 2061 పరుగులు చేశారు. ఐదు టెస్ట్ సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

1956లో తొలిసారి యాషెస్‌ టెస్టు సిరీస్‌ లో చోటు దక్కించుకున్నాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ లో సెంచరీ(104) తో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ రిచర్డ్ సన్ చెలరేగగా, అదే టెస్టులో ఓ సహచరుడు జిమ్ లేకర్ 19 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. 1965లో క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఓవరాల్ గా 161 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఆయన సొంతం. 1957లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక కావడం విశేషం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా