అంపైర్‌ తప్పుడు నిర్ణయం: గంభీర్‌ తిట్ల దండకం

12 Nov, 2018 16:07 IST|Sakshi

ఢిల్లీ: మైదానంలో సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ దురుసగా ప‍్రవర్తించడం మరోసారి చర్చనీయాంశమైంది. ఫీల్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయాన్ని ప్రకటించడంతో గంభీర్‌ దుర్భాషలాడుతూ మైదానాన్ని వీడాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో హిమాచల్‌ ప‍్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గంభీర్‌ తన సహనాన్ని కోల్పోయాడు.

సోమవారం ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా గంభీర్‌(44) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అయితే గంభీర్‌ ఔటై పెవిలియన్‌కు చేరే క్రమంలో అంపైర్‌ వైపు చూస్తూ తిట్ల దండకాన్ని అందుకున్నాడు.  హిమచల్‌ ప్రదేశ్‌ బౌలర్‌ డాగర్‌ ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ తొలి బంతిని మిడిల్‌ స్టంప్‌పైకి సంధించాడు. ఆ బంతిని ఆడే క్రమంలో గంభీర్‌ తన ప్యాడ్లను అడ్డుపెట్టి కాపాడుకునే యత్నం చేశాడు. అయితే ప్యాడ్లను తాకిన బంతి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ప్రియాన్షు చేతిలో పడింది. దాంతో వారు అప్పీల్‌కు వెళ్లడం, దాన్ని అంపైర్‌ ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయాయి.  అంపైర్‌ నిర్ణయంతో ఆశ్చర్యపోయిన గంభీర్‌ వెంటనే తన నోటికి పని చెప్పాడు. అంపైర్‌ వైపు చిరాకుగా చూస్తూ తిట్టుకుంటూ పెవిలియన్‌కు చేరాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు