ఐసీసీపై మండిపడ్డ క్రిస్ గేల్

5 Feb, 2015 20:44 IST|Sakshi
ఐసీసీపై మండిపడ్డ క్రిస్ గేల్

మెల్ బోర్న్: ప్రపంచకప్ కు చేరువలో క్రికెట్ బ్యాట్ సైజ్ తగ్గించాలన్నఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) యోచనపై వెస్టిండీస్ క్రికెట్ స్టార్ ఆటగాడు బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. అసలు వరల్డ్ కప్ కు ముందు ఈ ప్రతిపాదనను గేల్ తప్పబట్టాడు. ఆ నిర్ణయం సరైనది కాదని గేల్ తేల్చిచెప్పాడు. 'ప్రపంచకప్ ముందు బ్యాట్ సైజ్ మార్చే ఐసీసీ ఆలోచన కరెక్ట్ కాదు. అభిమానులు బ్యాట్ మెన్ గేమ్ గానే  క్రికెట్ ను చూస్తున్నప్పుడు బ్యాట్ సైజ్ లో మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే బౌలర్లు మరింత మెరుగ్గా రాణించడానికి యత్నిస్తే సరిపోతుంది'అని గేల్ స్పష్టం చేశాడు.

ప్రస్తుతం ఎక్కువ మంది వాడుతున్న బ్యాట్‌లు ‘అనవసరపు ప్రయోజనాన్ని’ కలిగిస్తున్నాయని, బౌలర్లతో పోలిస్తే క్రికెట్ బ్యాట్స్‌మన్ క్రీడగా మారిపోయిందని భావిస్తున్న ఐసీసీ... అందుకే బ్యాట్‌ల సైజుకు పరిమితి విధించాలని నిర్ణయించింది.  10-15 ఏళ్ల క్రితంతో పోలిస్తే బ్యాట్‌పై స్వీట్ స్పాట్ (బంతి ఎక్కువగా తగిలే మధ్య భాగం) బాగా వెడల్పుగా ఉంటోందని, కొన్ని సందర్భాల్లో గుడ్డిగా ఊపినా బంతి సిక్సర్‌గా మారుతోందని ఐసీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాట్ పొడవు 38 అంగుళాలు, వెడల్పు 4.25 అంగుళాలు మించకుండా ఉండాలని నిర్ణయించింది.

>
మరిన్ని వార్తలు