వాటే స్టన్నింగ్‌ క్యాచ్‌

9 Nov, 2019 10:33 IST|Sakshi

విశాఖ: యూసఫ్‌ పఠాన్‌ అనూహ్యంగా భారత్‌ జట్టులోకి దూసుకొచ్చి అంతే వేగంగా దూరమైన పోయిన క్రికెటర్‌. 2012లో చివరిసారి భారత్‌ తరఫున ఆడిన యూసఫ్‌ పఠాన్‌.. ఇంకా దేశవాళీ మ్యాచ్‌లు మాత్రం ఆడుతూనే ఉన్నాడు.  తాజాగా సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీ టీ20లో భాగంగా యూసఫ్‌ పఠాన్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్‌..  శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఒక స్టన్నింగ్‌ క్యాచ్‌తో అలరించాడు. గోవా కెప్టెన్‌ దర్శన్‌ మిశాల్‌ కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడగా అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న యూసఫ్‌ ఒక్కసారిగా గాల్లోకి డైవ్‌ కొట్టి క్యాచ్‌ అందుకున్నాడు.

గోవా ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ను అరోథి వేయగా దర్శన్‌ భారీ షాట్‌ కొట్టబోయాడు. అది కవర్స్‌ మీదుగా గాల్లోకి లేచిన సమయంలో యూసఫ్‌ మెరుపు ఫీల్డింగ్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో గోవా 4 వికెట్ల తేడాతో గెలిచింది.  బరోడా నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను గోవా 19.4 ఓవర్లలో ఛేదించింది.  కాగా, యూసఫ్‌ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. రెండు బంతులు ఆడి డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. తన సోదరుడు క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇర్ఫాన్‌ పఠాన్‌ ట్వీటర్‌లో షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన అఫ్గానిస్తాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ ప్రశంసలు కురిపించాడు. అదొక అద్భుతమైన క్యాచ్‌ అంటూ కొనియాడాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు