గో స్పోర్ట్స్ ఫౌండేషన్ బోర్డులో గోపీచంద్

28 Oct, 2014 00:47 IST|Sakshi
గో స్పోర్ట్స్ ఫౌండేషన్ బోర్డులో గోపీచంద్

ముంబై: లాభాపేక్షలేని క్రీడా సంస్థ ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సలహా మండలిలో  భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేరాడు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, స్టార్ షూటర్ అభినవ్ బింద్రా ఇప్పటికే ఈ బోర్డులో ఉన్నారు. సలహా మండలి సభ్యుడి హోదాలో గోపీచంద్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి సంబంధించిన సూచనలు చేస్తాడు. చిరుప్రాయంలోనే ప్రతిభావంతులను గుర్తించడం, కోచ్‌లకు మరింత మెళకువలు నేర్పించడం, యువ క్రీడాకారులకు ఆటకు సంబంధించిన విషయాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించడం వంటి అంశాల్లో గోపీచంద్ కీలకపాత్ర పోషిస్తాడు.

దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో 9 నుంచి 13 సంవత్సరాలలోపు ప్రతిభావంతులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో తాజాగా వచ్చిన మార్పులపై కోచ్‌లకు అవగాహన కల్పిస్తారు. ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్‌లో భాగస్వామిగా అయినందుకు సంతోషంగా ఉన్నాను. ఈ సంస్థతో కలిసి నేను దేశంలో బ్యాడ్మింటన్ మరింతగా అభివృద్ధి చెందేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’ అని గోపీచంద్ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు