ఆ మోడల్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడా?

10 Nov, 2019 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే చాలామంది బాలీవుడ్‌ భామలతో ఎఫైర్లు నడిపిన టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఇప్పడు కొత్త లవర్‌తో డేటింగ్‌లో ఉన్నాడట. గతంలో స్వీడన్ మోడల్ ఎల్లీ అవ్రామ్‌తో హార్దిక్‌ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు సెర్బియా మోడల్‌ నటనా స్టాన్‌కోవిచ్‌తో ప్రేమాయణ నడుపుతున్నాడట. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారట. గతంలో చాలామంది అమ్మాయిలతో తన ఎఫైర్లను డేటింగ్‌ వరేకే పరిమితం చేసిన హార్దిక్‌.. నటాషాత​ ప్రేమాయణాన్ని సీరియస్‌గానే సాగిస్తున్నాడట. ఈ ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేశాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నటాషాను హార్దిక్‌ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టే వారి వ్యవహారం ఇంటివరకూ వచ్చిందని అటు క్రికెట్‌ వర్గాలు, ఇటు సినీ వర‍్గాల టాక్‌.

ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన జీరో అనే మూవీలో నటాషా ఓ పాత్ర కూడా చేసింది. అన్నట్టు.. హిందీలో ప్రసారమవు తున్న డ్యాన్స్‌ రియాలిటీ టీవీ షో ‘నచ్‌ బలియే’లో పోటీపడుతోన్న నటాషాకు ఓట్లు వేసి గెలిపించా ల్సిందిగా హార్దిక్‌ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. సెర్బియాకు చెందిన నటాషా మూడేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌ నేర్చుకోవడం మొదలు పెట్టింది. కాగా, 2010లో స్పోర్ట్స్‌ సెర్బియా టైటిల్‌ను నటాషా గెలుచుకున్నారు. దాంతో స్పోర్ట్స్‌నే తన కెరీర్‌ను కొనసాగించాలని నటాషా నిర్ణయించుకున్నాడు. అయితే 2015లో కంపోజర్‌ బాద్‌షా రూపొందించిన హిట్‌ మ్యూజిక్‌ వీడియో డీజే వాలే బాబుతో నటాషాకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె సినీ కెరీర్‌ను భారత్‌లో కొనసాగిస్తున‍్నారు. ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే మరొకవైపు డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉన్నారు నటాషా.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా