డ్రెస్సింగ్‌ రూమ్‌ బోసిపోయింది!

12 Dec, 2019 14:20 IST|Sakshi

ముంబై:  టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌లు ఇద్దరూ బెస్ట్‌ ఫ్రెండ్స్‌.  వీరిద్దరూ జట్టులో ఉన్నారంటే కాస్త హడావుడి ఎక్కువగానే ఉంటుంది. గతంలో తాము ఇద్దరం భారత్‌ క్రికెట్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నామన్న సంగతి మరచిపోయి ఓ ఇంటర్వ్యూలో మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి అడ్డంగా బుక్కైపోయారు. అందుకు కొన్ని మ్యాచ్‌ల సస్పెన్షతో పనిష్మెంట్‌ కూడా అనుభవించాల్సి వచ్చింది. ఇదిలా ఉంచితే, వెస్టిండీస్‌తో మూడో టీ20లో భారత్‌ విజయం సాధించిన తర్వాత కేఎల్‌ రాహుల్‌ను హార్దిక్‌ ఇంటర్వ్యూ  చేశాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ లేకపోయినప్పటికీ స్టేడియానికి వచ్చి సహచర క్రికెటర్లను కలిశాడు.  

అయితే ఈ క్రమంలోనే రాహుల్‌-హార్దిక్‌లు చిట్‌చాట్‌ చేశారు. ఇక్కడ తాను లేకుండా ఆడేస్తున్నారంటూ రాహుల్‌ను హార్దిక్‌ ప్రశ్నించాడు. ఒక బ్యాట్‌తో తీసుకుని లోపలికి వచ్చి ఆడేయాలని ఉంది అంటూ హార్దిక్‌ అన్నాడు. ఇందుకు రాహుల్‌ తన సమాధానంలో భాగంగా ‘ నీ కోసమే నిరీక్షణ. డ్రెస్సింగ్‌ రూమ్‌కు తొందరగా వచ్చేసేయ్‌. నువ్వు లేక డ్రెస్సింగ్‌ రూమ్‌ బోసిపోయింది. కనీసం నా కోసమైనా వచ్చేయ్‌’ అంటూ రాహుల్‌ రిప్లై ఇచ్చాడు.  దీనికి సంబంధించి వీడియోను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది.

ఆఖరి టి20లో భారత్‌ 67 పరుగుల తేడాతో విండీస్‌పై గెలిచింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 240 పరుగుల భారీస్కోరు చేసింది. తర్వాత వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడింది.  ఈ మ్యాచ్‌లో రాహుల్‌(91) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా