వికెట్‌ తీసిన ఆనందంలో గంతేస్తే..

17 Jul, 2018 19:15 IST|Sakshi

హరారే: వికెట్‌ తీయగానే బౌలర్లు ఎగిరిగంతేస్తారు. ఇక్కడ ఒక్కో బౌలర్‌ ఒక్కో సిగ్నేచర్‌ స్టెప్‌తో అలరిస్తారు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ ఆటగాళ్లు ముందుంటారు. ముఖ్యంగా విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో వికెట్‌ తీయగానే అతడు వేసే స్టెప్పులు అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటాయి. ఇలా వికెట్‌ తీసి సంబరాలు చేసుకునే క‍్రమంలో బౌలర్‌ గాయపడటం అనేది చాలా అరుదు. అయితే పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ వికెట్‌ తీసిన ఆనందంలో గాయపడ్డాడు. హసన్‌ అలీ  వికెట్‌ తీయగానే తనదైన రీతిలో సిగ్నేచర్‌ స్టైల్‌ (బాంబ్‌ ఎక్స్‌ప్లోజన్‌)తో పాక్‌ అభిమానులను అలరిస్తుంటాడు.

జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో హసన్‌ అలీ ఆతిథ్య బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయగానే తనదైన రీతిలో సంబరాలు ప్రారంభించాడు. తన స్టైల్లో ఆనందం వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మెడ కండరాలు పట్టేశాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవుతోంది. నెటిజన్లు పాక్‌ బౌలర్‌పై మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్‌ పెడితే.. మరికొందరు జాలి పడుతున్నారు. దీనిపై స్పందించిన పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డ్‌(పీసీబీ) అలీ గాయం అంత తీవ్రతరమైనది కాదని పేర్కొంది.  

 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి! 

ఐపీఎల్‌ కన్నా ప్రాణం మిన్న

సఫారీ ఆటగాళ్లంతా సేఫ్‌ 

మీ మద్దతు కావాలి

ఆ క్షణం ఇంకా రాలేదు

సినిమా

టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్‌’ పాటకు స్టెప్పులు

పెళ్లిపీటలు ఎక్కుతున్న కీర్తి సురేష్‌?

మానవత్వం మరచిన తారలు

మేడమ్‌.. థ్యాంక్యూ: విద్యాబాలన్‌

ఫ్యాన్‌ శుభ్రం చేయడానికి స్టూల్‌ అవసరమా: హీరో

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...