పంత్‌పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!

4 Jan, 2019 15:12 IST|Sakshi
మైదానంలో భారత అభిమానుల సందడి

సిడ్నీ : ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన టీమిండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌.. చివరి టెస్ట్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాది.. ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. 189 బంతుల్లో 159 పరుగులు చేసిన పంత్‌.. నోటితోనే కాదు బ్యాట్‌తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు. అయితే ఈ సిరీస్‌ ఆసాంతం తన ప్రవర్తనతో అభిమానులను ఆకట్టుకున్న పంత్‌.. తాజా ప్రదర్శనతో వారి మనసులను దోచుకున్నాడు.

దీంతో చివరి టెస్ట్‌ చూడటానికి మైదానానికి వచ్చిన భారత అభిమానులు అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పంత్‌-పైన్‌ స్లెడ్జింగ్‌ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట లిరిక్స్‌.. "We've got Pant. Rishab Pant. I just don't think you'll understand. He'll hit you for a six. He'll babysit your kids. We've got Rishab Pant," నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్‌.

చతేశ్వర్‌ పుజారా(193), రిషభ్‌ పంత్‌ (159) సెంచరీలకు తోడుగా జడేజా (81), మయాంక్‌ అగర్వాల్‌ (77) అర్థసెంచరీలు చేయడంతో భారత్‌ 622 భారీ స్కోర్‌ వద్ద డిక్లేర్‌ ఇచ్చింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు