హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

15 Dec, 2019 20:49 IST|Sakshi

చెన్నై: వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో తొలి వన్డేలో హెట్‌ మెయిర్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. టీమిండియాతో మొదటి వన్డేలో హెట్‌మెయిర్‌ సెంచరీతో మెరిశాడు. ఇది హెట్‌మెయిర్‌కు వన్డేల్లో ఐదో సెంచరీ కాగా, 38వ ఇన్నింగ్స్‌. దాంతో ఒక అరుదైన రికార్డును హెట్‌మెయిర్‌ తన పేరిట లిఖించుకున్నాడు.


వెస్టిండీస్‌ తరఫున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వన్డే సెంచరీల మార్కును చేరిన వారిలో హెట్‌ మెయిర్‌ టాప్‌ ప్లేస్‌కు వచ్చేశాడు. ఆ తర్వాత స్థానంలో షాయ్‌ హోప్‌(46 ఇన్నింగ్స్‌లు), గ్రీనిడ్జ్‌(52 ఇన్నింగ్స్‌లు), రిచర్డ్స్‌(54 ఇన్నింగ్స్‌లు), క్రిస్‌ గేల్‌(66 ఇన్నింగ్స్‌లు), డేస్మండ్‌ హేన్స్‌(69 ఇన్నింగ్స్‌లు), బ్రియాన్‌ లారా(83 ఇన్నింగ్స్‌లు)లు  వరుసగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 85 బంతుల్లో హెట్‌ మెయిర్‌ సెంచరీ సాధించాడు.భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. సునీల్‌ ఆంబ్రిస్‌(9) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత షాయ్‌ హోప్‌-హెట్‌ మెయిర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను సమయోచితంగా  ముందుకు తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే హెట్‌ మెయిర్ సెంచరీ సాధించగా, హోప్‌ అర్థ శతకం సాధించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు