ఫైన ల్లో భారత మహిళలు

5 Nov, 2013 03:39 IST|Sakshi
ఫైన ల్లో భారత మహిళలు

 న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ)లో దూసుకెళుతోంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని సాధించి మరో లీగ్ మ్యాచ్ మిగిలుండగానే ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. జపాన్‌లోని కకామిగహరాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో సోమవారం మలేసియా జట్టును 5-1 తేడాతో భారత్ ఓడించింది. 15వ నిమిషంలోనే మలేసియా తొలి గోల్ సాధించి ఆధిక్యం సాధించింది. అయితే తొమ్మిది నిమిషాల అనంతరం భారత్ తరఫున పూనమ్ రాణి పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి స్కోరును సమం చేసింది. ద్వితీయార్థంలో భారత మహిళలు అద్భుత ఆటతీరును కనబరిచారు.
 
  నమిత టొప్పో (44వ ని.), రితూ రాణి (52 వ ని.), అమన్‌దీప్ కౌర్ (54వ ని.), దీప్ గ్రేస్ ఎక్కా (65వ ని.) వరుసగా గోల్స్ సాధించిన ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశారు. మరోవైపు జపాన్ 5-1తో చైనాను ఓడించి ఫైనల్‌కు చేరింది. భారత్ తన చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో జపాన్‌తో గురువారం తలపడుతుంది. శనివారం ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్యనే జరుగుతుంది.
 

>
మరిన్ని వార్తలు