అటువంటిదేమీ లేదు: భువనేశ్వర్ కుమార్

17 Oct, 2015 17:54 IST|Sakshi
అటువంటిదేమీ లేదు: భువనేశ్వర్ కుమార్

రాజ్ కోట్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో మూడు వికెట్లను సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన భువనేశ్వర్ కుమార్ తాను ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)నుంచి ఎంతో నేర్చుకున్నానని స్పష్టం చేశాడు. తాను పూర్తిస్థాయి పేస్ బౌలర్ గా పరిణితి సాధించడానికి ట్వంటీ 20 లీగ్ లే కారణమని తెలిపాడు.  ప్రత్యేకించి చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడమంటే తనకు గతంలో ఒక సాహసంగా ఉన్నా.. ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్ లు ఆడిన కారణంగా దాన్ని అధిగమించినట్లు భువనేశ్వర్ తెలిపాడు. ఇదిలా ఉండగా, గాల్లో బంతిని స్వింగ్ చేయడంలో తడబడుతున్నాడనే వాదనను భువీ కొట్టిపారేశాడు.

 

'బంతిని స్వింగ్ చేయలేకపోతున్నానని నేను అనుకోవడం లేదు. నేను బంతిని  స్వింగ్ చేయగలను. నా స్వింగ్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే తొలి మూడు ఓవర్లలో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తే ఎప్పుడైనా స్వింగ్ చేస్తా.  చివరి ఓవర్లలో బౌలింగ్ నాలో నమ్మకాన్ని పెంచింది. అందుకు ఐపీఎల్లో అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేయడమే కారణం'' అని భువీ తెలిపాడు. 

మరిన్ని వార్తలు