క‌రోనాతో మాజీ అథ్లెట్ మృతి

8 Apr, 2020 19:15 IST|Sakshi

రోమ్‌ : ఇట‌లీకి చెందిన మాజీ అథ్లెట్ డొనాటో సాబియా(56) కరోనా వైరస్‌  కార‌ణంగా మృతి చెందాడు. 800 మీట‌ర్ల రేస్‌లో రెండు సార్లు ఒలింపిక్ ఫైన‌ల్స్‌కు చేరిన డొనాటో కొవిడ్‌-19 కార‌ణంగా బుధ‌వారం క‌న్నుమూసిన‌ట్లు ఇటాలియ‌న్ ఒలింపిక్ క‌మిటీ (సీవోఎన్ఐ)  ప్ర‌క‌టించింది. గ‌త కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న డొనాటో.. ప‌రిస్థితి విష‌మించి మృతిచెందిన‌ట్లు అందులో పేర్కొంది. 1984 లాస్ఎంజెల్స్ ఒలింపిక్స్ 800 మీట‌ర్ల విభాగంలో ఐదో స్థానంలో నిలిచిన సాబియా.. 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఏడో స్థానం ద‌క్కించుకున్నాడు. యూరోపియ‌న్ ఇండోర్ చాంపియ‌న్‌షిప్‌లో స్వ‌ర్ణం నెగ్గిన డొనాటో మృతి ప‌ట్ల సీవోఎన్ఐ సంతాపం తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 14 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 83వేలకు పైగా ఉంది.
 

మరిన్ని వార్తలు