కోహ్లీకి ఆ అవినీతి పరుడంటే ఇష్టం!

22 Jun, 2017 18:43 IST|Sakshi
కోహ్లీకి ఆ అవినీతి పరుడంటే ఇష్టం!

న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ కొత్త కోచ్‌ కోసం వేట మొదలు పెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే నిజాయతీ పరుడైన కుంబ్లే తన బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నాడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుంబ్లే రాజీనామా వివాదంలో కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) విరుచుకుపడ్డాడు. నిజాయతీగా పనిచేసే వ్యక్తులు కోహ్లీకి నచ్చరంటూ ట్వీట్ చేశాడు కేఆర్కే.

'కుంబ్లే నిజాయతీపరుడు. విరాట్ మాత్రం రవిశాస్త్రి లాంటి వ్యక్తినే కోచ్గా ఇష్టపడతాడు. రవిశాస్త్రి కూడా కోహ్లీ లాగే అవినీతి పరుడు కావడమే ఇందుకు కారణమని' కేఆర్కే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా కప్పు నెగ్గదని కేఆర్కే జోస్యం చెప్పగా అదే నిజమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ప్రవర్తన వల్లే జట్టు ఓటమిని మూటకట్టుకుంటుందని కెప్టెన్ పై నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం కోచ్ వివాదంలోనూ కుంబ్లేకు ఎసరు పెట్టడానికి కారణంపై స్పందించాడు. కోహ్లీకి తనలాగే అవినీతికి పాల్పడే వ్యక్తే కోచ్గా ఉండేందుకు ఇష్టపడతాడని భారత కెప్టెన్ పై విమర్శలు గుప్పించాడు.

 

మరిన్ని వార్తలు