అక్కా చెల్లెళ్ల పోరు లేనట్లే..

7 Jul, 2016 20:42 IST|Sakshi
అక్కా చెల్లెళ్ల పోరు లేనట్లే..

లండన్:చాలాకాలం తర్వాత వింబుల్డన్ ఫైనల్ కు చేరాలని భావించిన వీనస్ విలియమ్స్ పోరు సెమీ ఫైనల్లోనే ముగిసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో సెమీ ఫైనల్లో  వీనస్ విలియమ్స్ 4-6, 4-6 తేడాతో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్ర్రమించింది.  దీంతో చెల్లెళు సెరెనా విలియమ్స్తో అక్క వీనస్ విలియమ్స్ పోరును వీక్షించే అవకాశ దక్కలేదు. అంతకుముందు జరిగిన సెమీ ఫైనల్లో సెరెనా విలియమ్స్ విజయం సాధించి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. సెరెనా 6-2, 6-0 తేడాతో ఎలెనా ఎస్నినాపై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది.  దీంతో సెరెనా మరోసారి కెర్బర్తో పోరుకు సన్నద్ధమైంది. ఈ ఏడాది ఆదిలో జరిగిన ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్లో సెరెనాపై కెర్బర్ విజయం సాధించి ట్రోఫీని సాధించిన కైవసం చేసుకుంది. దీంతో ఈ ఇద్దరి క్రీడాకారుణుల మధ్య ఆసక్తికర పోరు జరిగే అవకాశం ఉంది.

వింబుల్డన్ లో చివరి అడ్డంకిని సెరెనా అధిగమిస్తే... ఓపెన్ శకంలో అత్యధికంగా 22 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌తో స్టెఫీ గ్రాఫ్ పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. ఇప్పటివరకూ సెరెనా 303 గ్రాండ్ స్లామ్ విజయాలను సాధించగా,  వింబుల్డన్ లో 9వ సారి ఫైనల్ కు చేరింది. ఇందులో ఆరు సార్లు టైటిల్ ను సాధించడంలో సెరెనా సఫలమైంది. 

>
మరిన్ని వార్తలు