బ్రియాంట్‌ చివరి ట్వీట్‌ ఇదే..

27 Jan, 2020 11:13 IST|Sakshi
2012 ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో బ్రియాంట్‌, జేమ్స్‌లు

కాలిఫోర్నియా: అమెరికన్‌ నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ చరిత్రలో టాప్‌ స్కోరర్లలో ఒకడిగా ఉన్న కోబ్‌ బ్రియాంట్‌  హెలికాప్టర్‌ ప్రమాదంలో అకాలమరణం చెందడం ప్రతీ ఒక్కర్నీ తీవ్రంగా కలచివేసింది. 2008, 2012 ఒలింపిక్స్‌ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్‌ది కీలకపాత్ర. 2016లో బాస్కెట్‌బాల్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న బ్రియాంట్‌.. అమెరికా నేషనల్‌ బాల్ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) ప్రొఫెషనల్‌ లీగ్‌లో తన కెరీర్‌ మొత్తం లాస్‌ ఏంజెల్స్‌ లేకర్స్‌ కే ఆడాడు. (ఇక్కడ చదవండి: ఆ వార్త వినడం దురదృష్టకరం: కోహ్లి)

ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్‌ చేసిన జాబితాలో బ్రియాంట్‌ మూడో స్థానంలో ఉండగా అతన్ని తాజాగా లీబ్రాన్‌ జేమ్స్‌ అధిగమించాడు. దీనిపై జేమ్స్‌కు బ్రియాంట్‌ అభినందలు తెలియజేస్తూ.. ‘నన్ను అధిగమించిన  నా బ్రదర్‌కు ఇవే నా విషెస్‌. గేమ్‌ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్‌ జేమ్స్’ అని ట్వీట్‌ చేశాడు. ఇదే అతని చివరి ట్వీట్ అయ్యింది‌. మృతిచెందడానికి కొన్ని గంటల ముందు జేమ్స్‌ను కొనియాడుతూ బ్రియాంట్‌ చేసిన ట్వీట్‌ ఇది. (ఇక్కడ చదవండి: బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కోబ్‌ దుర్మరణం)

మరిన్ని వార్తలు