బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ వీడియో కలకలం

15 Feb, 2018 09:19 IST|Sakshi
లీ చోంగ్‌ వీ (పాత చిత్రం)

కౌలాలంపూర్‌ : బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ ‘లీ చోంగ్ వీ’ పేరిట సోషల్‌ మీడియాలో ఓ పోర్న్‌ క్లిప్‌ వైరల్‌ అవుతోంది. మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌గా మారటంతో ఎట్టకేలకు చోంగ్‌ వీ స్పందించాడు. అందులో ఉంది తాను కాదని.. దానిని వైరల్‌ చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాడు. తన పేరును చెడగొట్టేందుకే కొందరు ఈ పని చేసి ఉంటారని అతను చెబుతున్నాడు. 

మలేసియా ఎయిర్‌ న్యూస్‌ కథనం ప్రకారం... సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో ఒకటి గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. అందులో ఉంది ప్రపంచ బ్యాడ్మింటన్‌ ర్యాంక్‌ 2  ఆటగాడు అయిన లీ చోంగ్‌ వీ(35) అని కొందరు వైరల్‌ చేశారు .‘అదొక ఫేక్‌ వీడియో. అందులో ఉంది నేను కాదు. నా పరువును బజారుకీడ్చేందుకు కొందరు పని గట్టుకుని ఈ పని చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను. దయచేసి ఈ వీడియోను వైరల్‌ చెయ్యకండి. కష్టాలను కొని తెచ్చుకోకండి’ అంటూ చోంగ్‌ ఫేస్‌ బుక్‌లో ఓ పోస్టు ఉంచాడు. చోంగ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్‌ బ్రాంచ్‌ దర్యాప్తు చేపట్టింది.

కాగా, చోంగ్‌.. మలేసియన్‌ షట్లర్‌(మాజీ) వోంగ్‌ మ్యూ చూను వివాహం చేసుకోగా.. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సార్లు ఒలంపిక్‌ సిల్వర్‌ పతక విజేత అయిన చోంగ్‌.. ఆ మధ్య డోపింగ్‌ ఆరోపణలతో కూడా వార్తల్లో నిలిచాడు. వచ్చే నెలలో అతగాడి బయోపిక్‌ ‘లీ చోంగ్‌ వీ : రైజ్‌ ఆఫ్‌ ది లెజెండ్‌’ విడుదలకు సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పోర్న్‌ వీడియో కలకలం రేగటం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు