6కే ఆలౌట్‌... ఇదీ క్రికెట్టే!

19 Jun, 2019 05:54 IST|Sakshi

టి20ల్లో మాలి మహిళల జట్టు చెత్త రికార్డు

కిగలి సిటీ: ఓ వైపు పురుషుల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్‌ 17 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేస్తే... మరోవైపు మహిళల అంతర్జాతీయ టి20లో 6 పరుగులకే ఆలౌటైన చెత్త రికార్డు మంగళవారం నమోదైంది. క్విబుక మహిళల టి20 టోర్నీలో మాలి జట్టు ఈ కొత్త చెత్త రికార్డును తమ పేర లిఖించుకుంది. రువాండతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన మాలి మహిళల జట్టు 9 ఓవర్లలో 6 పరుగులు చేసి ఆలౌటైంది. మరో ఆసక్తికర విషయమేంటంటే ఓపెనర్‌ సమకె (1) చేసిన పరుగే టాప్‌ స్కోర్‌! ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పది మంది ‘జీరో’లే! ఒక్కరు మినహా అందరు 6, 7 బంతులాడి ఖాతా తెరవకుండానే ఔటైతే... కౌలిబెలీ మాత్రం అత్యధికంగా 12 బంతులాడి డకౌటైంది. ఇక మిగతా 5 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. 2 బైస్, మరో 2 లెగ్‌బైస్, ఒకటేమో వైడ్‌... ఇది మాలి ఇన్నింగ్స్‌ కథకమామిషు! ఈ చెత్త రికార్డును ఛేదించేందుకు బరిలోకి దిగిన రువాండ జట్టు 4 బంతులాడి 8 పరుగులు చేసి గెలిచింది. ఇదే ఏడాది జనవరిలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో చైనా నెలకొల్పిన చెత్త రికార్డు (14 ఆలౌట్‌)ను మాలి సవరించింది.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా