హాకీ కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌

19 May, 2017 01:01 IST|Sakshi
హాకీ కెప్టెన్‌గా మన్‌ప్రీత్‌

ప్రపంచ లీగ్‌ సెమీఫైనల్‌కు భారత జట్టు

 హైదరాబాద్‌: జూన్‌లో జరిగే మూడు దేశాల హాకీ టోర్నీ, ప్రపంచ హాకీ లీగ్‌ సెమీఫైనల్‌ టోర్నీలో పాల్గొనే భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. జర్మనీ, లండన్‌లో జరిగే ఈ టోర్నీల్లో పాల్గొనే 18 మందితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ‘అజ్లాన్‌షా కప్‌ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన కెప్టెన్, గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. అతడి స్థానంలో జట్టును మన్‌ప్రీత్‌ నడిపిస్తాడు’ అని హాకీ ఇండియా తెలిపింది. వరల్డ్‌ లీగ్‌ను కనీసం రెండో స్థానంతో ముగించాలని కోరుకుంటున్నట్టు జట్టు కోచ్‌ ఓల్ట్స్‌మన్‌ అన్నారు.

జట్టు వివరాలు: ఆకాశ్‌ చిక్తే, వికాస్‌ దహియా(గోల్‌కీపర్లు), పర్దీప్‌ మోర్, కొథాజీత్‌ సింగ్, సురేందర్‌కుమార్, రూపిందర్‌పాల్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్, చింగ్లన్‌సన సింగ్, ఎస్‌కేఉతప్ప, సత్‌బీర్‌సింగ్, సర్దార్‌సింగ్, మన్‌ప్రీత్‌ సింగ్, హీర్జీత్‌ సింగ్, రమణ్‌దీప్‌ సింగ్, ఎస్‌వీ సునీల్, తల్విందర్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్‌.

మరిన్ని వార్తలు