1996లో మాది ఫిక్సింగ్ రూమ్

18 Oct, 2016 00:55 IST|Sakshi

షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్య  
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌కు, మ్యాచ్ ఫిక్సింగ్‌కు అవినాభావ సంబంధం ఉందని మరోసారి తేలిపోయింది. 1996 సమయంలో తమ డ్రెస్సింగ్ రూమ్ ఓ ఫిక్సింగ్ రూమ్‌లా కనిపించేదని షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్య చేశాడు. ‘అప్పట్లో మా డ్రెస్సింగ్ రూమ్‌లో క్రికెట్ కంటే ఫిక్సింగ్‌కు సంబంధించిన ముచ్చట్లే ఎక్కువగా వినిపించేవి. 1996 సమయంలో ఫిక్సర్లు మా జట్టును శాసించారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం అధ్వానంగా ఉండేది’ అని అక్తర్ చెప్పాడు.

1999 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్ క్రికెటర్లంతా స్థాయికి తగ్గట్లుగా ఆడి ఉంటే టైటిల్ గెలిచేవాళ్లమని వ్యాఖ్యానించాడు. ఫిక్సింగ్‌కు దూరంగా ఉండాలని ఆమిర్‌కు తాను 2010లో సూచించానని, అదే ఏడాది అతను ఇంగ్లండ్‌తో స్పాట్ ఫిక్సింగ్ చేసి దొరికిపోయాడని చెప్పాడు.

మరిన్ని వార్తలు