మ్యాక్స్‌వెల్‌ బాదేశాడు..

11 Jan, 2020 12:29 IST|Sakshi

మెల్‌బోర్న్‌: బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ నేతృత్వంలోని మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచ్‌లకు గాను ఏడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. శుక‍్రవారం మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెనిగేడ్స్‌ నిర్దేశించిన 169 పరుగుల టార్గెట్‌ను మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇంకా ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఓపెనర్‌ స్టోయినిస్‌ డకౌట్‌ నిష్ర్కమించగా, మరో ఓపెనర్‌ హిల్టన్‌ కార్ట్‌రైట్‌(35) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బెన్‌ డంక్‌(14) విఫలమయ్యాడు. ఆ తరుణంలో నిక్‌ లార్కిన్‌కు జత కలిసిన కెప్టెన్‌ మ్యాక్స్‌వెల్‌ పరుగుల మోత మోగించాడు.  భారీ హిట్లు సాధిస్తూ రెనిగేడ్స్‌ బౌలర్లను చిత్తు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు బాదిన మ్యాక్స్‌వెల్‌.. ఒకే ఒక్క ఫోర్‌ కొట్టాడు.19 ఓవర్‌లో రెండు సిక్సర్లు కొట్టి మెల్‌బోర్న్‌ స్టార్స్‌కు మరో విజయాన్ని అందించాడు. ముందుగా బ్యాటింగ్‌ చేసిన రెనిగేడ్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఓపెనర్లు షాన్‌ మార్ష్‌(63), మార్కస్‌ హారిస్‌(42)లు శుభారంభాన్ని అందించారు. ఆపై వెబ్‌స్టెర్‌(25) ఫర్వాలేదనిపించగా, మిగతా వారు విఫలమయ్యారు. దాంతో రెనిగేడ్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా