ధోని నిర్ణయంపై భార్య సాక్షి స్పందన

5 Jan, 2017 12:29 IST|Sakshi
ధోని నిర్ణయంపై భార్య సాక్షి స్పందన

జార్ఖండ్:భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఆకస్మికంగా వైదొలిగిన మహేంద్ర సింగ్ ధోని గురించి ఇప్పటికే పలువురు స్పందించగా, తాజాగా అతని భార్య సాక్షి సింగ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత పదేళ్ల నుంచి తిరుగులేని భారత క్రికెట్ సారిథిగా ఉన్న ధోని.. ఇక అధిరోహించే శిఖరాలు ఏమీ లేవంటూ ప్రత్యేకమైన మెస్సేజ్ను ట్వీట్ చేసింది.

 

' నా భర్త ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్ ను చూసి గర్విస్తున్నా. ఇక ధోని ఎక్కే  పర్వతాలు ఏమీ లేవు. అందుచేత అతన్నే ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. ధోని నిర్ణయాలు తీసుకునే ముందు చాలా ఆలోచించే తీసుకుంటాడు. నా భర్త ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్టుగానే ఉంటుంది' అని భార్య సాక్షి పేర్కొంది.


భారత క్రికెట్‌ జట్టు వన్డే, టి20 జట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం మహేంద్ర సింగ్‌ ధోని ప్రకటించాడు. జట్టు కెప్టెన్‌గా ఇకపై కొనసాగబోనని అతను బీసీసీఐకి సమాచారం అందించాడు. అయితే ఈనెల 15 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు ఆటగాడిగా మాత్రం అందుబాటులో ఉంటానని అతను వెల్లడించాడు.

మరిన్ని వార్తలు