50–0 నుంచి 90 ఆలౌట్‌!

26 Nov, 2018 22:07 IST|Sakshi

పాక్‌తో రెండో టెస్టులో కివీస్‌ చెత్త రికార్డు

8 వికెట్లతో విజృంభించిన యాసిర్‌ షా

దుబాయ్‌: తొలి టెస్టులో విజయానికి దగ్గరగా వచ్చి చతికిలపడిన పాకిస్థాన్‌... రెండో టెస్టులో ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో హారిస్‌ సొహైల్‌(147), బాబర్‌ ఆజామ్‌(127 నాటౌట్‌) సెంచరీలతో 418/5 వద్ద డిక్లేర్‌ చేసిన పాక్‌.. అనంతరం కివీస్‌ను 90 పరుగులకే ఆలౌట్‌ చేసింది.   

యాసిర్‌ షా మాయాజాలం..
ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కివీస్‌ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ దశలో యాసిర్‌ షా మాయాజాలం మొదలైంది. ఓపెనర్‌ జీత్‌ రావల్‌ వికెట్‌తో మొదలుపెట్టిన యాసిర్‌ .. క్రీజులోకి వచ్చిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌నూ కుదురుకోనివ్వలేదు. దీంతో కివీస్‌ 50–0 నుంచి 90కే ఆలౌట్‌ అయ్యింది. కెప్టెన్‌ విలియమ్సన్‌(28 నాటౌట్‌), ఓపెనర్లు జీత్‌ రావల్‌(31), టామ్‌ లాథమ్‌(22) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కివీస్‌ జట్టులో ఏకంగా ఆరుగురు డకౌట్‌ అయ్యారు. అనంతరం ఫాలోఆన్‌కు దిగిన న్యూజిలాండ్‌ను యాసిర్‌ షా మరోసారి దెబ్బకొట్టాడు. ఓపెనర్‌ జీత్‌ రావల్‌(2), కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌(30)ను ఔట్‌ చేశాడు. ప్రస్తుతం క్రీజులో టామ్‌ లాథమ్‌(44 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌(49 బ్యాటింగ్‌ ఉన్నారు.     

>
మరిన్ని వార్తలు