ఇషాన్‌ దూకుడు; పాక్‌ విలవిల

30 Jan, 2018 08:34 IST|Sakshi

క్రైస్ట్‌చర్చ్‌: భారత్‌తో జరుగుతున్న అండర్‌–19 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో పాకిస్తాన్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 273 పరుగులు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యువ పాకిస్తాన్‌ స్వల్పస్కోరుకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. 45 పరుగులకే 7 వికెట్లు నష్టపోయింది. 21 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది.

యువ భారత బౌలర్‌ ఇషాన్‌ పోరెల్ నిప్పులు చెరిగే బంతులతో పాక్‌ బ్యాట్స్‌మన్‌ను వణికిస్తున్నాడు. మొదటి నాలుగు వికెట్లు అతడే నేలకూల్చడు. ఇమ్రాన్‌ షా(2), మహ్మద్‌ జైద్‌ ఆలం(7), అలీ జర్యాబ్‌(1), అమ్మద్‌ ఆలం(4)లను పెవిలియన్‌ను పంపించాడు. రియాన్‌ పరాగ్‌ రెండు వికెట్లు పడగొట్లాడు. శివసింగ్‌ ఒక వికెట్‌ తీశాడు.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. శుభ్‌మాన్‌ గిల్ సెంచరీ(102)తో చెలరేగాడు. పృథ్వీ షా(41), మన్‌జ్యోత్‌ కల్రా(47), సుధాకర్‌ రాయ్‌(33) రాణించారు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 

మరిన్ని వార్తలు