ఎక్స్‌పర్ట్‌ అక్తర్‌ను మించిపోయిన పొలార్డ్‌

12 Nov, 2019 16:04 IST|Sakshi

లక్నో: క్రికెట్‌లో బౌలర్లు నో బాల్స్‌ వేయడం సర్వసాధారణమే. ఎప్పుడైతే బౌలర్లు ఓవర్‌స్టెపింగ్‌తో ముందుకు వెళ్లి బంతి సంధిస్తారో దాన్ని ఎటువంటి అనుమానం లేకుండా అంపైర్‌ నో బాల్‌గా ప్రకటిస్తాడు. మరి ఆ నో బాల్స్‌ను డెడ్‌ బాల్స్‌కు మార్చుకోవాలంటే షోయబ్‌ అక్తర్‌ను, కీరోన్‌ పొలార్డ్‌లను చూసి నేర్చుకోవాల్సిందే. సోమవారం అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్‌ కెప్టెన్‌, ఆల్‌ రౌండర్‌ పొలార్డ్‌ 25 ఓవర్‌ను వేసేందుకు వచ్చాడు. అఫ్గానిస్తాన్‌ ఆటగాళ్లు అస్గర్‌ అఫ్గాన్‌-నజిబుల్లా జద్రాన్‌ల భాగస్వామ్యాన్ని విడగొట్టడానికి పొలార్డ్‌ ఓవర్‌ను అందుకున్నాడు.

అయితే పరుగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను  వేయబోయే క్రమంలో పొలార్డ్‌ ఉన్నపళంగా ఆగిపోయాడు. ఏమైందనేది మ్యాచ్‌ చూస్తున్న ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. కానీ తను ఎందుకు ఆగాల్సి వచ్చిందో పొలార్డ్‌కు తెలుసు. ఆ బంతి వేసే క్రమంలో ఓవర్‌స్టెపింగ్‌ కావడంతో అంపైర్‌ నో బాల్‌ అంటూ అరిచాడు. అంతే పొలార్డ్‌ బంతిని పట్టుకుని అలానే ముందుకు వెళ్లిపోయాడు. ఇక అంపైర్‌ చేసేది లేక ముసిముసిగా నవ్వుతూ డెడ్‌బాల్‌గా ప్రకటించాడు.

ఈ తరహా ఘటనలో క్రికెట్‌లో ఏమీ కొత్తకాదు. గతంలో అనేక సందర్భాల్లో మనం చూశాం. ఇందులో ఎక్స్‌పర్ట్‌ అక్తర్‌. తన క్రికెట్‌ ఆడిన సమయంలో అక్తర్‌ ఇటువంటి ట్రిక్‌లే ఎక్కువ ఫాలో అయ్యేవాడు. అక్తర్‌ వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ బౌలర్లలో ఒకడు కావడంతో అంపైర్‌ నో బాల్‌ అనగానే ఆగిపోయే వాడు. ఇప్పుడు ఆ అక్తర్‌నే మించిపోయాడు పొలార్డ్‌. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పుడు పొలార్డ్‌కు సంబంధించిన వీడియోను ఒకనాటి అక్తర్‌ వీడియోకు జత చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా