క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ

4 Aug, 2017 15:05 IST|Sakshi
క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ

బెంగళూరు:బెంగళూరు బ్యాట్స్మన్ ప్రోలు రవీంద్ర క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మ్యాచ్ లో జింఖానా తరుపున బరిలోకి దిగిన రవీంద్ర 29 బంతుల్లో శతకం సాధించి సరికొత్త రికార్డును సాధించాడు. రెండు రోజుల క్రితం రాజేశ్వరినగర్ లో జైదుర్ క్లబ్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. తద్వారా వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ నెలకొల్పిన ఫాస్టెస్ సెంచరీ రికార్డును రవీంద్ర బ్రేక్ చేశాడు. ట్వంటీ 20 మ్యాచ్ లో గేల్ 30 బంతుల్లో సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

ఓవరాల్ గా రవీంద్ర 58 బంతుల్లో 13 సిక్సర్లు, 4 ఫోర్లతో 144 పరుగులు నమోదు చేశాడు. దాంతో ఈ 50 ఓవర్ల మ్యాచ్ లో జింఖానా 403 పరుగులు భారీ స్కోరు సాధించింది. అనంతరం జైదుర్ క్లబ్ 229 పరుగులకే పరిమితమై భారీ ఓటమి పాలైంది.ఈ మ్యాచ్ అనంతరం రవీంద్ర మాట్లాడుతూ.. తన ఫాస్టెస్ సెంచరీని తన ఆదర్శ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు