ఫిక్సింగ్ నివారణకు రెండంచెల వ్యూహం: ద్రవిడ్

7 Aug, 2013 18:36 IST|Sakshi
ఫిక్సింగ్ నివారణకు రెండంచెల వ్యూహం: ద్రవిడ్

మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ క్రిమినల్ నేరమని  టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. కఠినమైన చట్టాలతోనే దీన్ని నివారించగలమని అభిప్రాయపడ్డాడు.  మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ను అరికట్టేందుకు రెండంచెల వ్యూహాన్ని ద్రవిడ్ సూచించాడు. వర్థమాన క్రికెటర్లకు జూనియర్ స్థాయిలో అవగాహన కల్పించాలని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. దీంతో పాటు చట్టాన్ని కఠినతరం చేయాలని అన్నాడు.

ఈ చర్యలు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పాడు. ఐపీఎల్ ఆరో ఎడిషన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రాజస్థాన్ రాయల్స్కు చెందిన ముగ్గురు క్రికెటర్లు శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే వీరు నేరం చేశారా, లేదా అనే దానిపై తానేమీ మాట్లాడబోనని ద్రవిడ్ అన్నాడు. తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే హక్కు అందరికీ ఉందన్నాడు. క్రికెట్ ప్రయోజనాలను కాపాడేందుకు పోలీసుల దర్యాప్తుకు క్రికెట్ పాలకులు సహకరించాలని సూచించాడు. 

>
మరిన్ని వార్తలు