రాజ్‌కుమార్‌కు స్వర్ణం

10 Nov, 2019 09:56 IST|Sakshi

జాతీయ మాస్టర్స్‌ అక్వాటిక్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. శనివారం సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎమ్‌సీ స్విమ్మింగ్‌ పూల్‌లో 80 ప్లస్‌ విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ పోటీల్లో సి.రాజ్‌కుమార్‌ (తెలంగాణ) విజేతగా నిలిచాడు. తెలంగాణకే చెందిన ఓం అవతార్‌ రెండో స్థానంలో నిలిచాడు. 35–39 ఏళ్ల విభాగంలో జరిగిన 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో అజిత్‌ సుదర్శన్‌ (తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా... త్రిపథ్‌ ప్రశాంత్‌ (మహారాష్ట్ర), చంద్రకాంత్‌ (మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

పురుషుల 55–54 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో కె.సురేంద్ర (తెలంగాణ), జక్రియా అలీఖాన్‌ (ఏపీ), ఉత్తమ్‌ పాటిల్‌ (మహారాష్ట్ర) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. పురుషుల 30–34 ఏళ్ల విభాగంలో బ్యాక్‌స్ట్రోక్‌లో మీనాక్షి జైన్‌ (తెలంగాణ) తొలి స్థానంలో నిలువగా... సోనాలీ మనోహర్‌ (మహారాష్ట్ర), సప్నా యాదవ్‌ (మహారాష్ట్ర) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన 650 మందికి పైగా స్విమ్మర్లు పాల్గొంటున్నారు.  

మరిన్ని వార్తలు