శ్రీలంక సంచలన విజయం

17 Aug, 2016 15:38 IST|Sakshi
శ్రీలంక సంచలన విజయం

కొలంబో: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో శ్రీలంక చారిత్రక విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసింది. ఈ సిరీస్ కు ముందు.. 33 ఏళ్లలో ఈ రెండు దేశాల మధ్య జరిగిన టెస్టుల్లో ఆసీస్ పై ఒకే ఒక టెస్టు గెలిసిన లంకేయులు 3-0తో తాజా సిరీస్ ను దక్కించుకుని చరిత్ర సృష్టించారు. రంగనా హిరాత్ సంచలన బౌలింగ్ తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి మొత్తం 13 వికెట్లు పడగొట్టి జట్టుకు విజయాన్ని సాధించిపెట్టాడు.

చివరి టెస్టులో 324 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్మిత్ సేన 44.1 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. 163 పరుగులతో ఓడిపోయిన కంగారూ టీమ్ సిరీస్ తో పాటు నంబర్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. వార్నర్(68) ఒక్కడే ఒంటరి పోరాటం చేసినా జట్టును కాపాడలేకపోయాడు. ఐదుగురు  బ్యాట్స్ మన్లు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 355, ఆస్ట్రేలియా 379 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 347/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.  'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్', 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' రెండూ హిరాత్ కే దక్కాయి.

మరిన్ని వార్తలు