బేబీ సిట్టర్‌ యాడ్‌పై స్పందించిన పంత్‌

13 Feb, 2019 12:54 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ జట్టు కెప్టెన్‌ టీమ్‌ పెయిన్‌తో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ సరదా మాటల యుద్దం చర్చనీయాంశమైంది. స్లెడ్జింగ్‌లో భాగంగా పంత్‌ను పెయిన్‌ మా పిల్లలను ఆడిస్తావా? అని కోరడం.. దీన్ని పంత్‌ నిజం చేయడం.. దీనికి పెయిన్‌ భార్య.. పంత్‌ బెస్ట్‌ బేబీ సిట్టర్‌ అని కితాబివ్వడం తెలిసిందే. ఆ తర్వాత రోహిత్‌ కూడా తన కూతురిని ఆడిస్తావా? అని అడగడం.. బెబీసిట్టర్‌గా పంత్‌కు బోలేడు అవకాశాలు రావడంతో ఈ పదం పాపులర్‌ అయింది.  దీన్ని క్యాచ్‌ చేసుకున్న స్టార్‌ స్పోర్ట్స్‌..  టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో ఓ కమర్షియల్‌ యాడ్‌నే రూపోందించింది. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో భాగంగా రూపొందించిన ఈ యాడ్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. భారత అభిమానులను ఈ వీడియో వీపరీతంగా ఆకట్టుకుంటుండగా.. ఆసీస్‌ మాజీ ఆటగాళ్లు, అభిమానులకు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కేవలం భారత అభిమానులను దృష్టిలో ఉంచుకొని తీసిన ఈ వీడియోపై.. ‘బేబీ సిట్టర్‌’ ట్రెండింగ్‌ సృష్టికర్త రిషబ్‌పంత్‌ తనదైన శైలిలో స్పందించాడు.

‘వీరూ పాజీ.. గొప్ప క్రికెటర్‌గా.. బేబీ సిట్టర్‌గా ఎలా ఉండాలో చూపించారు. స్పూర్తిదాయకమైన వీడియో’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ వీడియోపై ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్‌ ఘాటుగా స్పందించాడు.  ప్రధానంగా ఆసీస్‌ జట్టు జెర్సీలతో యాడ్‌ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆసీస్‌ను తేలిగ్గా తీసుకోవద్దు వీరూ అంటూ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో ఎవరు బేబీ సిట్టర్స్‌ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు. ఆసీస్‌ ఏమీ పసికూన కాదనే సంగతిని తెలుసుకోవాలని హెచ్చరించాడు. భారత పర్యటనకు రానున్న ఆసీస్‌..  రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌ ఆడనుంది. ఈ ఫిబ్రవరి 24న ప్రారంభమయ్యే తొలి టీ20తో ఈ సిరీస్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు