రీతూ రాణికే పగ్గాలు

4 Sep, 2014 01:14 IST|Sakshi
రీతూ రాణికే పగ్గాలు

ఆసియా క్రీడలకు భారత మహిళల హాకీ జట్టు
 న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రీతూ రాణి సారథ్యంలోనే భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనుంది. బీపీ గోవిందా, హర్బీందర్ సింగ్, సురీందర్ కౌర్, హై పెర్‌ఫార్మెన్స్ డెరైక్టర్ రోలెంట్ ఓల్ట్‌మన్స్, చీఫ్ కోచ్ నీల్ హవ్‌గుడ్‌లతో కూడిన సెలక్షన్ ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఈనెల 13న ఇంచియోన్‌కు బయలుదేరుతుంది. ఆసియా క్రీడలు ఈనెల 19 నుంచి అక్టోబరు 4 వరకు జరుగుతాయి. కామన్వెల్త్ గేమ్స్ కంటే మరింత మెరుగైన స్థానం సాధించాలన్న లక్ష్యంతో ఆమెను ఎంపిక చేశామని ప్యానెల్ తెలిపింది.  
 
 జట్టు: రీతూ రాణి (కెప్టెన్, మిడ్ ఫీల్డర్), సవిత (గోల్‌కీపర్), దీప్ గ్రేస్ ఎక్కా, దీపిక, సునీతా లక్రా, నమితా టోపో, జస్‌ప్రీత్ కౌర్, సుశీలా చాను, మోనిక (డిఫెండర్లు), లిలిమా మిన్జ్, అమన్‌దీప్ కౌర్, చంచన్ దేవి (మిడ్ ఫీల్డర్లు), రాణి రాంపాల్, పూనమ్ రాణి, వందన కటారియా, నవజ్యోత్ కౌర్ (ఫార్వర్డులు).
 

మరిన్ని వార్తలు