ఫెడరర్ జిగేల్..

29 Jan, 2017 19:14 IST|Sakshi
ఫెడరర్ జిగేల్..

మెల్బోర్న్:సుదీర్ఘ విరామం తరువాత స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ జిగేల్మన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ను రోజర్ ఫెడరర్ కైవసం చేసుకుని తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1,3-6, 6-3  తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ను ఓడించి టైటిల్ ను సొంతం చేసకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో తన పూర్వపు ఫామ్ను అందుకున్న ఫెడరర్..  దాదాపు ఐదేళ్ల తరువాత గ్రాండ్ స్లామ్ను సాధించడం విశేషం.

 

దాదాపు మూడు గంటల 45నిమిషాల పాటు ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన జోరును కొనసాగించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన టైటిల్ రేసులో  ఫెడరర్ 150 పాయింట్ల సాధించగా, నాదల్ 139లకే పరిమితమయ్యాడు. ఇక ఏస్ల విషయంలో ఫెడరర్ 20 ఏస్లను సంధిస్తే, నాదల్ 4 ఏస్లను మాత్రమే సాధించాడు.

తొలి సెట్ నుంచి ఫెడరర్ ఆధిపత్యం కొనసాగింది. మొదటి సెట్ను గెలుచుకున్న ఫెడరర్.. రెండో సెట్ను నాదల్ కు కోల్పోయాడు. ఇక మూడో సెట్లో ఫెడరర్ అత్యంత నిలకడగా ఆడాడు. ఆ సెట్లో నాదల్ను పాయింట్కు మాత్రమే ఇచ్చిన ఫెడరర్ ఆధిక్యం సాధించాడు.  ఆ తరువాత నాల్గో సెట్లో నాదల్ చెలరేగిపోయాడు. ఫెడరర్ను ముప్పు తిప్పలు పెడుతూ కచ్చితమైన ప్లేస్మెంట్స్తో ఆ సెట్ను సాధించి స్కోరును సమం చేశాడు. దాంతో నిర్ణయాత్మక ఐదో సెట్ అనివార్యమైంది. ఐదో సెట్ ఆదిలో ఫెడరర్ వెనుకబడినప్పటికీ, చివరవరకూ పోరాడి విజయం సాధించాడు. ఇది ఫెడరర్ కెరీర్లో 18 గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా,ఐదో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టైటిల్. చివరిసారి 2012లో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఫెడరర్.. ఆ తరువాత ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలవడం ఇదే తొలిసారి.

 

ఫెడరర్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్

ఆస్ట్రేలియా ఓపెన్(2004,06,07,10,17)

ఫ్రెంచ్ ఓపెన్(2009)

వింబుల్డన్ ఓపెన్(2003,04,05,06,07,09,12)

యూఎస్ ఓపెన్(2004,05,06,07,08)


మరిన్ని వార్తలు