క్రీడాభిమానులకు రూటర్‌ స్పోర్ట్స్‌ యాప్‌

25 Jan, 2017 00:03 IST|Sakshi

హైదరాబాద్‌: ‘‘ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొడతాడు’’... ‘‘జో రూట్‌ ఐదు వికెట్లు తీయడం గ్యారెంటీ.. ఇంగ్లండ్‌దే విజయం’’! మ్యాచ్‌ రోజు ఫ్రెండ్స్‌ మధ్య ఇలాంటి మాటలు బోలెడు! మరి... మీకు ఎంతమంది సపోర్ట్‌ చేస్తున్నారు? ప్రత్యర్థి టీమ్‌కు మద్దతుదారులు ఎంతమందో తెలుసుకోవాలని ఉందా? వారితోనూ క్రికెట్‌ చర్చలు, వాదోపవాదాలు చేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మా స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ను వాడేయండి అంటోంది రూటర్‌ స్పోర్ట్స్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌!

క్రీడాభిమానుల వన్‌సైడెడ్‌ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి ఇంకో లెవల్‌కు తీసుకెళ్లేందుకు ఈ అప్లికేషన్‌ భలే ఉపయోగపడుతుందని అంటోంది ఈ కంపెనీ. ఎప్పటికప్పుడు మ్యాచ్‌ స్కోర్లను లైవ్‌లో ఇవ్వడంతోపాటు మీకు నచ్చిన టీం, ఆటగాడికి మద్దతుగా మీరు ఈ ప్లాట్‌ఫామ్‌పై మాట్లాడవవచ్చు. ఈ యాప్‌ ఒక్క క్రికెట్‌కు మాత్రమే కాదు.. ఫుట్‌బాల్, టెన్నిస్‌ పోటీలకూ వాడుకోవచ్చు. త్వరలో అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలకు దీన్ని విస్తరిస్తామని కంపెనీ చెబుతోంది.

>
మరిన్ని వార్తలు